పథకాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:21 PM
ప్రభుత్వ పథకాలపై చెంచు గిరిజన యువత అవగాహన కల్గి ఉండాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్ అన్నారు. వెలుగు కార్యాలయంలో ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్ సూచనల మేరకు ఆర్ హెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్
పెద్ద దోర్నాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలపై చెంచు గిరిజన యువత అవగాహన కల్గి ఉండాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్ అన్నారు. వెలుగు కార్యాలయంలో ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్ సూచనల మేరకు ఆర్ హెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గిరిజన యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, అంబేడ్కర్ ఓవర్సీస్ వంటి విద్యా పథకాలను సద్వినియోగ పర్చుకుని అభివృద్ధి చెందాలన్నారు. అదేవిధంగా ఆధార్‌కార్డులు అప్‌డేట్ చేయించుకోవడం, ఫోన్‌నెంబర్ అనుసంధానించడం, కొత్తగా మంజూరైన స్మార్ట్ కార్డు ఈకేవైసీ చేయించుకోవడం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పక్కవారికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో జవహర్‌లాల్ నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.