ముప్పా సురేష్ అరెస్టు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:02 AM
టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ముప్పా సురేష్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు.
14 రోజులు రిమాండ్ విధించిన న్యాయాధికారి
ఒంగోలు క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ముప్పా సురేష్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.