స్మార్టుకార్డులతో బహుళ ప్రయోజనాలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:53 AM
స్మార్ట్‌కార్డులతో లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలున్నాయని, సాంఘి క సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు పేర్కొన్నారు.
అద్దంకి, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌కార్డులతో లబ్ధిదారులకు బహుళ ప్రయోజనాలున్నాయని, సాంఘి క సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు పేర్కొన్నారు. సోమవారం అద్దంకిలో పలువురు లబ్ధిదారులకు కార్డులను అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి రేషన్ కార్డులపై కూడా తన ఫొటో ముద్రించుకున్నాడన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌కార్డుల ద్వారా మెరుగైన సేవలు ప్రజ లకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో రోడ్డు ప్రమాదాల జరగకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ ఉదయం, సాయంత్రం సమయంలో నామ్ రోడ్డు లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ను ఉంచాలన్నారు. త్వరలో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతా మన్నారు. దీని ద్వారా కొంత మేర ట్రాఫిక్ మరల్చ వచ్చన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న పాత భవనా లను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ రవీంద్రకు మంత్రి రవికుమార్ సూచిం చారు. పలువురి నుంచి వచ్చిన అర్జీలను తీసుకున్నారు. కార్యక్రమాలలో తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఆర్‌ఐ శంకర్, స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, కౌన్సిలర్లు సుభాషిణి లహరి, అత్తులూరి రమేష్ పాల్గొన్నారు.
అద్దంకి: వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివా లయ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత జీతాలు పెంచిం దని సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి డీవీబీ స్వామి అన్నారు. అద్దంకిలో పలు కార్య క్రమాలకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు స్వామి, రవికుమార్లకు వేర్వేరుగా సచివాలయ ఉద్యో గులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భం గా పనిభారం తగ్గించాలని, ఇంటింటి సర్వేలు లేకుండా చేయాలని సచివాలయ ఉద్యోగులు మంత్రి స్వామిని కోరగా స్పందించిన మంత్రి ఇంటింటి సర్వే సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. గతంలో ఒక పంచాయతీ కార్యదర్శి చేసే పనికి ప్రస్తుతం 8 మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నందున పని విభజన చేసుకొని ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు.