స్మార్ట్ కార్డులతో బహుళ ప్రయోజనాలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:27 AM
ప్రభుత్వం తాజాగా అందిస్తున్న స్మార్ట్ కార్డులతో బహుళ ప్రయోజనాలు సమకూరుతాయని యువ నాయకులు గౌరీఅమర్నాధ్, తహసీల్దార్ గోపీకృష్ణ పేర్కొన్నారు.
దేవాంగపురి(చీరాల), సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం తాజాగా అందిస్తున్న స్మార్ట్ కార్డులతో బహుళ ప్రయోజనాలు సమకూరుతాయని యువ నాయకులు గౌరీఅమర్నాధ్, తహసీల్దార్ గోపీకృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని దేవాంగపురిలో ప్రజలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ నూతన విధానం ద్వారా సులభతరంగా సరుకులు అందుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ పధకాలకు కార్డును గుర్తింపుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే నిత్యవసరాల పంపిణీలో పారదర్శకంగా వీలుం టుందని చెప్పారు. నాయకులు సిధ్ధి బుచ్చేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇంకొల్లు : పేదల సంక్షేమమే ప్రజా కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు అన్నారు. తహసీల్ధారు కార్యాలయం వద్ద గురువారం స్మార్ట్ రేషన్‌కార్డులను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర మాలకార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్‌కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌కార్డులు అందజేస్తామన్నారు. మండలంలో 15,500 స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ గుంజి వెంకట్రావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్యవిభాగపు ప్రధాన కార్యదర్శి పాలేరు రామకృష్ణ, ఇంకొల్లు పీఏసీఎస్ ఛైర్మన్ కరి శ్రీనివాసరావు, టీడీపీటౌన్ అధ్యక్షులు మార్క్, చిలుకూరి శ్రీనివాసరావు, బోడెంపూడి సుబ్బారావు, మీరావలి, సీతారామయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
16,931 స్మార్టు కార్డులు
బల్లికురవ : మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో పేదలకు ప్రభుత్వం 16,931 స్మార్టు రేషన్ కార్డులను మంజురు చేసిందని తహసీల్దార్ రవినాయక్ తెలిపారు. ఈ కార్డులను గ్రామాలో ఉన్న రేష న్ షాపుల ద్వారా ప్రజలకు అందజే స్తామన్నారు. గతంలో ఉన్న రేషన్ కార్డుల స్ధానంలో ప్రభుత్వం స్మార్టు కార్డులను ప్రవేశపెట్టింద న్నారు.
చినగంజాం : మండల పరిధిలోని రాజుబంగారు పాలెం, సోపిరాల గ్రామంలోని చౌకధరల దుకాణాల్లో గురువారం స్మార్ట్‌రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్డులతో సరుకులు సులభంగా పొందవచ్చని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్‌ఐ బండారు దానియేలు, రాజుబంగారుపాలెం కార్యదర్శి ఉష, టీడీపీ నాయకులు కోకి ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, సందు శ్రీనివాసరావు, వాటుపల్లి ఏడుకొండలు, నరహరి శ్రీనివాసరావు, భోగిరెడ్డి కోటిరెడ్డి రేషన్‌డీలర్లు తదితలరులు పాల్గొన్నారు.