జాతీయస్థాయి డ్రైవింగ్ స్కూల్ నిర్మాణంలో కదలిక!
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:03 AM
జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం పునర్నిర్మా ణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం చం ద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మంగ ళవారం అసెంబ్లీలో సీఎంను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు.
నిధుల మంజూరుకు సీఎం హామీ
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం పునర్నిర్మా ణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం చం ద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మంగ ళవారం అసెంబ్లీలో సీఎంను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా దర్శి నియో జకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వి వరించి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయా లని విజ్ఞప్తి చేశారు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పునాదుల్లోనే నిలపోయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్ర బాబు నిధులు మంజూరు చేస్తానని స్పష్టమైన హమీ ఇచ్చారని, త్వరలో పనులు ప్రారంభానికి చర్యలు తీసు కుంటారని చెప్పారు. మధ్యలో నిలచిన అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తిచేసి పథకం ప్రారంభానికి నిధులు విడు దల చేయాలని, వెంకటచలంపల్లి-దొనకొండ డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు నిధులు మంజూ రుచేయాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి నట్లు ఆమె వివరించారు.
దొనకొండలో సోలార్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకోవటం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరి నట్లు ఆమె వివరించారు. దర్శి నియోజకవర్గ అభివృ ద్ధికి అవసరమైన నిధులు అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు.