లారీని ఢీకొని మోటార్ సైకిలిస్టు మృతి
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:04 AM
మోటార్‌సైకిల్‌పై అద్దంకి నుంచి మైలవరం వెళ్తున్న జమ్మలమడక లింగయ్య(32) ముందు వెళ్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
అద్దంకి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : మోటార్‌సైకిల్‌పై అద్దంకి నుంచి మైలవరం వెళ్తున్న జమ్మలమడక లింగయ్య(32) ముందు వెళ్తున్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... అద్దంకి మండలం మైలవరానికి చెందిన లింగయ్య శుక్రవారం మధ్యాహ్నం అద్దంకి వచ్చి రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వెళ్తూ శాంతినగర్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని గమనించకుండా వెనుక వైపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు గోతులమయంగా ఉండటం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని సీఐ సుబ్బరాజు పరిశీలించారు. భార్యనాగలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.