బిడ్డతో కాలువలోకి దూకిన తల్లి
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:07 AM
మండలంలోని మారెడ్డిపల్లికి చెందిన వి.గోవిందమ్మ బిడ్డతో సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న దర్శి ఎస్‌ఐ ఎం.మురళి గమనించారు. కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు తీసి కాపాడారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం
కాపాడిన ఎస్‌ఐ మురళి
దర్శి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మారెడ్డిపల్లికి చెందిన వి.గోవిందమ్మ బిడ్డతో సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న దర్శి ఎస్‌ఐ ఎం.మురళి గమనించారు. కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు తీసి కాపాడారు. తల్లీబిడ్డను వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. భర్తతో విభేదం రావడంతో మనస్థాపానికి గురై గోవిందమ్మ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. తల్లీబిడ్డను కాపా డిన ఎస్‌ఐను పలువురు అభినందించారు.