భవనాశి కాలువలో నాచు తొలగింపు పనులు ప్రారంభం
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:50 AM
భవనాశి లోలెవల్ కాలువలో నాచు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.
అద్దంకి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భవనాశి లోలెవల్ కాలువలో నాచు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. భవనాసి చెరువు నుంచి గోపాలపురం, అద్దంకి, వేలమూరిపాడు గ్రామాల పొలాలకు సాగునీరు అందించే భవనాసి లోలెవల్ కాలువలో పూర్తిగా నాచు పెరిగి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఆయకట్టు రైతులు నారుమడుల సాగుకు సమాయత్తం అవుతున్న తరుణంలో నీటి విడుదలకు నాచు అడ్డంకి గా మారింది. దీంతో ప్రభుత్వం నుంచి రూ.7 లక్షల మేర నిధులు మంజూరు కావడంతో ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసి నాచు తొలగింపు పనులు ప్రారంభించారు. సుమారు 10 కి.మీ దూరం భవనాశి లోలెవల్ కాలువ ఉండగా అవసరమైన ప్రాంతాలలో నాచు తొలగింపు చేయిస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ నారాయణస్వామి తెలిపారు. మరో వారం రోజులలో నీటి విడుదల జరిగే అవకాశం ఉండడంతో నారుమడుల సాగకు రైతులు సమాయత్తం అవుతున్నారు.