బాబోయ్.. దోమలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:26 AM
చీరాల మున్సిపల్ పరిధిలోని దండుబాట రోడ్డులో వ్యర్ధ జలాలు, మురుగు నిల్వలతో ప్రజలు విలవిల్లాడు తున్నారు.
చీరాల, నవంబరు17 (ఆంధ్రజ్యోతి) : చీరాల మున్సిపల్ పరిధిలోని దండుబాట రోడ్డులో వ్యర్ధ జలాలు, మురుగు నిల్వలతో ప్రజలు విలవిల్లాడు తున్నారు. జనావాసాల్లో మురుగు నీరు చేరి దోమలు విజృంభిస్తున్నాయి. పందులు పేట్రేగిపోతున్నాయి. దీంతో దోమలు అవాసాలు ఏర్పాటు చేసుకుని చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డెంగ్యూ బారినపడి పలువురు రోధిస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. పారిశుధ్యం సక్రమంగా లేదని, చెత్తసేకరణ అంతంత మాత్రంగానే ఉందని ఆరోపిస్తున్నారు.