మోపాడు ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 10:46 PM
జైకా నిధులతో చేపట్టిన మోపాడు ఆధునికీకరణ పనులను వేగవంతం గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జైకా నిధులతో చేపట్టిన మోపాడు ఆధునికీకరణ పనులను వేగవంతం గా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోపాడు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిచేసి ఆయకట్టు రైతులకు నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు సూచించా రు. ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతున్నందున రైతుల కు సాగు నీరు అందించటం ఎంతో అవసరమన్నారు. జైకా నిధుల సహకారంతో చేపట్టిన పనులు కూడా ఇం కా పూర్తి చేయకపోవటంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకపోవటంతో రైతులు ఇబ్బం దులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు తమవంతు కృషి చే యాలని కోరారు. పెండింగ్ పనులన్నింటినీ వేగవంతం గా పూర్తిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సి బ్బంది, అధికారులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించవలసి వ స్తుందని హెచ్చరించారు. ప్రధానంగా రైతులకు వ్యవ సాయమే జీవనాధారమన్నారు. మోపాడు ఆయకట్టు రైతులకు సరిపడ నీరు అందించేందుకు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.
సమావేశంలో ఇరిగేషన్ డీఈ ఈ కె.విజయభాస్కర్ రెడ్డి, ఏఈఈలు సీహెచ్ ప్రసాద్, వినయ్‌కుమార్, రామకృష్ణ, మోపాడు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సి.కొండయ్య, వైస్‌చైర్మన్ నరసింహారావు, వెంక టనారాయణరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎస్‌పురం(పామూరు), ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలం ఎగువపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ శిఖర కలిశ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అలాగే, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శి బోమ్మనబోయిన వెంగయ్య, మన్నేపల్లి వ్రీనివాసులు, సర్పంచ్ శ్రీరాం పద్మావతి, బోబ్బూరి రమేష్, మన్నేపల్లి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.