అద్దంకికి అధునాతన బస్టాండ్
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:45 AM
రానున్న రెండుమూడేళ్లలో అద్దంకిలో అధునా తన బస్టాండ్ నిర్మించనున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు అన్నారు.
అద్దంకి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రానున్న రెండుమూడేళ్లలో అద్దంకిలో అధునా తన బస్టాండ్ నిర్మించనున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు అన్నారు. అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ముందుగా బస్టాండ్ ప్రాంగ ణంలో మొక్కను నాటారు. కార్మికులతో మాట్లాడి, పలు విభాగాలలో ఉత్తమ కార్మికుల ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకిలో ప్రస్తుతం ఉన్న దుకాణాల వలన మంచి ఆదాయం వస్తోంద న్నారు. విశాలమైన స్థలం ఉన్నందున ముందు వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి వెనుక వైపు ఆధునాతన వసతులతో ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆర్టీసీ ఆదాయం మరింత పెరుగుతుందన్నారు. స్త్రీశక్తి పథకం అమలులో పక్కరాష్ట్రంలో వివిధ సమ స్యలు ఉత్పన్నం కాగా, మనరాష్ట్రంలో విజయ వంతమైందన్నారు. గతంలో ఆర్టీసీ బస్సులలో 40 శాతం మంది మహిళలు ప్రయాణి స్తుండగా ప్రస్తుతం 65 శాతానికి చేరినట్లు తెలిపారు. మరిన్ని బస్సులలో మహిళాశక్తి పథకం అమలుచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నార న్నారు. ప్రయాణికులు సంఖ్య పెరిగినందున అన్ని బస్టాండ్ లలో వసతులు పెంచుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2550 ఎలక్ర్టిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఉన్న బస్సులనే ఎక్కువ ట్రిప్పులు తిప్పేవిధంగా చర్యలు చేపడుతు న్నామన్నారు. బస్సుల మెయింటినెన్స్ కూడా పెంచుతున్నామన్నారు. వ్యయం తగ్గించడంతో పాటు నాన్‌టికెట్ ఆదాయం పెంచేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందుతుందన్నారు. ఇప్పటికే మెరుగైన వైద్య వసతులు కల్పించి 1200 మంది కార్మికుల ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. స్త్రీశక్తి పధకం అమలు తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగి బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయ న్నారు. ఆయిల్ ఎక్కువ ఖర్చు అవుతుందని అద్దె బస్సుల యజమానులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికా రులు ఎండీ ద్వారకాతిరుమలరావును సన్మా నించారు. కార్యక్రమంలో నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, ఈడీ (ఆపరే షన్స్) అప్పలరాజు, నెల్లూరు ఈడీ నాగేంద్ర ప్రసాద్, డీపీటీవో సామ్రాజ్యం, సీటీఎం రవికాంత్, డీఎం బెల్లం రామ్మోహనరావు, అసిస్టెంట్ డీఎం మహబూబి తదితరులు పాల్గొన్నారు.