Share News

కొప్పోలులో అంబేడ్కర్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:07 PM

ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో అంబేడ్కర్‌ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు.

కొప్పోలులో అంబేడ్కర్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
అంబేడ్కర్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్దన్‌, మేయర్‌ సుజాత, కమిషనర్‌ వెంకటేశ్వరరావు

ఒంగోలు(రూరల్‌),డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో అంబేడ్కర్‌ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు. ఈ భవనాన్ని రూ.2కోట్ల 30లక్షలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సుజాత, కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ నరసయ్య, నాయకులు కొటారి నాగేశ్వరరావు, కాట్రగడ్డ రఘు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

ఎన్టీఆర్‌ వర్ధంతిని జనవరి18వ తేదీన నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. పార్టీ కార్యాలయంలో నిర్వహణ కమిటీతో దామచర్ల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదివేలమంది పేదలకు భోజనం ఏర్పాటు చేయడంతోపాటు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే ప్రతి డివిజన్‌లోనూ వర్ధంతిని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:07 PM