మహిళకు ఎమ్మెల్యే సాయం
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:11 PM
పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
ప్రతినెలా సొంతంగా రూ.4వేల పింఛన్
గిద్దలూరు టౌన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. పట్టణంలోని పాములపల్లె రోడ్డులో ఉంటున్న షేక్ బేగమున్నీసా పక్షవాతంతో బాధపడుతుండగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తన కార్యాలయంలో సోమవారం సాయం అందించారు. నవంబరు 1 నుంచి రూ.4వేలు పింఛన్‌గా తన సొంత డబ్బులు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పింఛన్ మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.