బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
ABN , Publish Date - May 21 , 2025 | 11:49 PM
కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
కంభం, మే 21 (ఆంధ్రజ్యోతి) : కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హా జరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.