Share News

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి సొసైటీ సభ్యుల సన్మానం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:21 PM

ఇటీవల కంభం సొసైటీ బ్యాంక్‌ నూతన కమిటీ సభ్యులను నియమించగా వారు బుధవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కంభం సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ కేతం శ్రీను, మెంబర్లు కర్నం బాలకోటయ్య, సందు వరలక్ష్మి నియమితులవగా వారితోపాటు మండల పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి సొసైటీ సభ్యుల సన్మానం
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న కంభం సొసైటీ సభ్యులు

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల కంభం సొసైటీ బ్యాంక్‌ నూతన కమిటీ సభ్యులను నియమించగా వారు బుధవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కంభం సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ కేతం శ్రీను, మెంబర్లు కర్నం బాలకోటయ్య, సందు వరలక్ష్మి నియమితులవగా వారితోపాటు మండల పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కంభం మండలపార్టీ అధ్యక్షులు తోట శ్రీను, మండల నాయకులు ఉన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

వాతావరణశాఖ హెచ్చరిక మేరకు కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులపాటు భారీగా పడనున్న దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. కాలువలు, వంకలు, చెరువులు ఉధృతంగా ప్రవహించే పరిస్థితి ఉందని ప్రజలు అటువైపు వెళ్లవద్దని అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు తలెత్తిన పక్షంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 15, 16, 17 తేదీలలో పాఠశాలలకు సెలవులు ఉన్నందున ఆసమయంలో పిల్లలు ఈతకు వెళ్లడం, చెరువులు, వాగుల్లో ఆడుకోవడం చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 13 , 2025 | 11:21 PM