Share News

‘కొనకనమిట్ల’లో స్వల్ప భూకంపం

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:18 AM

కొనకనమిట్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. చిన్నారికట్ల, పెద్దారికట్ల, ఈరసలగుండం, పాతపాడు, బీకేపాడు, గొట్లగట్టు, కొనకనమిట్ల, సిద్ధవరం, నాగరాజుకుంటతోపాటు మరో ఐదారు గ్రామాల్లో 3 నుంచి 4 సెకన్లపాటు భూమి కంపించింది

‘కొనకనమిట్ల’లో స్వల్ప భూకంపం

మండలంలో దాదాపు 15 గ్రామాల్లో ప్రకంపనలు

భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు

కొనకనమిట్ల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కొనకనమిట్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. చిన్నారికట్ల, పెద్దారికట్ల, ఈరసలగుండం, పాతపాడు, బీకేపాడు, గొట్లగట్టు, కొనకనమిట్ల, సిద్ధవరం, నాగరాజుకుంటతోపాటు మరో ఐదారు గ్రామాల్లో 3 నుంచి 4 సెకన్లపాటు భూమి కంపించింది వేకువజామున ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ఏం జరిగిందోనని ప్రజలు మేల్కొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 01:18 AM