Share News

నేడు మార్కాపురంలో మంత్రి స్వామి పర్యటన

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:38 PM

మార్కాపురంలోని సర్వజన వైద్యశాలలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఐసీయూ, ఽథైరాయిడ్‌ కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ కందుల నారాయణరెడ్డి శుక్రవారం సర్వజన వైద్యశాలలో ఏర్పాట్లను, మండలంలోని బోడపాడు గ్రామాలలో పరిశీలించారు. ఐదు లక్షల రూపాయలతో ఐసీయూ గది ఆధునికీకరణ, ఐదు లక్షల రూపాయలతో థైరాయిడ్‌ పరీక్షా పరికరాలతో గదిని ఏర్పాటు చేశారు.

నేడు మార్కాపురంలో మంత్రి స్వామి పర్యటన
స్థానిక సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన థైరాయిడ్‌ పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంఎల్‌ఏ కందుల

మార్కాపురం రూరల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి). మార్కాపురంలోని సర్వజన వైద్యశాలలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఐసీయూ, ఽథైరాయిడ్‌ కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ కందుల నారాయణరెడ్డి శుక్రవారం సర్వజన వైద్యశాలలో ఏర్పాట్లను, మండలంలోని బోడపాడు గ్రామాలలో పరిశీలించారు. ఐదు లక్షల రూపాయలతో ఐసీయూ గది ఆధునికీకరణ, ఐదు లక్షల రూపాయలతో థైరాయిడ్‌ పరీక్షా పరికరాలతో గదిని ఏర్పాటు చేశారు. అలాగే మండలంలోని బోడపాడు గ్రామంలో 55 లక్షల రూపాయలతో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల ను, గోకులం షెడ్‌లను ప్రారంభిస్తారు. అనంతరం గ్రామస్థులతో సమావేశంలో పాల్గొంటారు.

మండలంలోని నికరంపల్లి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మండలంలోని వేములకోట పంచాయతీ లోని జంకె రామిరెడ్డి కాలనీలో ప్రజలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.

Updated Date - Jul 18 , 2025 | 11:38 PM