Share News

రేపు వెలిగొండకు మంత్రి నిమ్మల

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:45 AM

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వెలిగొండ ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. ఈనెల 7న ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించేందుకు మళ్లీ వస్తానని చెప్పారు.

రేపు వెలిగొండకు మంత్రి నిమ్మల

నాలుగురోజుల వ్యవధిలోనే మరోసారి సమీక్ష

త్రిపురాంతకం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వెలిగొండ ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. ఈనెల 7న ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించేందుకు మళ్లీ వస్తానని చెప్పారు. ఈ మేరకు మంత్రి నాలుగు రోజుల వ్యవధిలోనే రెండోసారి వస్తుండటం వెలిగొండకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రికి వెలిగొండ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9.30గంటలకు ప్రాజెక్ట్‌ టన్నెళ్ల వద్ద పనులను పరిశీలిస్తారు. 11 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Updated Date - Nov 11 , 2025 | 01:45 AM