Share News

మంత్రి నిమ్మల పర్యటన వాయిదా

ABN , Publish Date - Dec 10 , 2025 | 02:23 AM

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు వెలిగొండ పర్యటన వాయిదా పడింది. ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నట్లు ఆ ప్రాజెక్టు అధికారులకు సోమవారం సమాచారం అందింది.

మంత్రి నిమ్మల పర్యటన వాయిదా

ఇరిగేషన్‌ అధికారులకు అందిన సమాచారం

ఒంగోలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు వెలిగొండ పర్యటన వాయిదా పడింది. ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నట్లు ఆ ప్రాజెక్టు అధికారులకు సోమవారం సమాచారం అందింది. విజయవాడ నుంచి మంగళవారం రాత్రికి బయల్దేరి దోర్నాల వచ్చి అక్కడ బస చేసి బుధవారం ఉదయం ప్రాజెక్టు పనుల పరిశీలన, అధికారు లతో సమీక్ష చేస్తారని షెడ్యూల్‌ ఇచ్చారు. తదనుగుణంగా ఏర్పాట్లు చూడాలని అధికారులను మంత్రి కార్యాలయం ఆదేశించింది. ఆమేరకు ప్రాజెక్టు ఇంజ నీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేపట్టగా మంత్రి పర్యటన వాయిదాపడినట్లు వారికి మంగళవారం మధ్యాహ్నం సమాచారం వచ్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష ఉంది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నిమ్మల దోర్నాల బయల్దేరి రావాల్సి ఉంది. అయితే ఆయన కర్నూలు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉండగా ఆ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు విజయవాడకు రావడంతో వారితో అనివార్యంగా నిమ్మల సమావేశం కావాల్సి వచ్చినట్లు సమాచారం. అలాగే బుధవారం సీఎం మరో కీలకమైన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి కూడా మంత్రి నిమ్మల హాజరు కావాల్సి రావడంతో వెలిగొండ సందర్శన కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇక 11న మంత్రివర్గ సమావేశం ఉండగా ఆతర్వాత వెలిగొండకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Dec 10 , 2025 | 02:23 AM