నేడు దోర్నాలకు మంత్రి నిమ్మల
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:34 AM
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలన కోసం గురువారం దోర్నాలకు రానున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దోర్నాల నుంచి బయల్దేరి కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్లను పరిశీలిస్తారు.
రేపు వెలిగొండ పనుల పరిశీలన
అక్కడే అధికారులతో సమీక్ష
త్రిపురాంతకం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలన కోసం గురువారం దోర్నాలకు రానున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దోర్నాల నుంచి బయల్దేరి కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్లను పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గత నెలలో రెండుసార్లు ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన మంత్రి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. పనితీరు తెలుసుకునేందుకు తరచూ వస్తానని, ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పూర్తికి కృతనిశ్చయంతో ఉందని అధికారులను హెచ్చరించారు. ఈనేపథ్యంలో మంత్రి నిమ్మల మరోసారి వస్తున్న సందర్భంగా అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు అవసరమైన నివేదికలతో సిద్ధమయ్యారు.