Share News

దోర్నాలకు చేరుకున్న మంత్రి నిమ్మల

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:21 AM

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి దోర్నాలకు చేరుకున్నారు. స్థానిక వెలిగొండ అతిథి గృహం వద్ద మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ అబుత్‌ఆలి, ఇంజనీరింగ్‌ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.

దోర్నాలకు చేరుకున్న మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మలకు స్వాగతం పలుకుతున్న అధికారులు

నేడు వెలిగొండ పనుల పురోగతి పరిశీలన

పెద్దదోర్నాల,నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి దోర్నాలకు చేరుకున్నారు. స్థానిక వెలిగొండ అతిథి గృహం వద్ద మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ అబుత్‌ఆలి, ఇంజనీరింగ్‌ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. కొద్దిరోజుల క్రితం కొత్తూరు వద్ద తెగిన తీగలేరు వాగును, సొరంగం లోపలికి చేరిన వరద నీటి తొలగింపు పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని, కారణాలు చెప్పకుండా పనులు ఆగకుండా లక్ష్యాన్ని ఎంత త్వరగా చేరుకోవాలన్నదే అందరి బాధ్యత అని సూటిగా చెప్పారు. మళ్లీ వస్తానని పనుల్లో వేగం పుంజుకోవాలని సూచించారు. అన్నట్టుగానే బుధవారం ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ఆయన దోర్నాలకు చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, ఎలకపాటి చెంచయ్య, కటికల శ్రీనివాసులు,దర్శనం దేవయ్య, కె.సుబ్బారెడ్డి, జి.వెంగళరెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 01:21 AM