12న జిల్లాకు మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:55 PM
: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈనెల 12న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి మండలం పచ్చవలో ఆ రోజు సాయంత్రం ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, ఆ గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు తానికొండ రాంబొట్లు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.
పచ్చవలో ఎన్టీఆర్, దామచర్ల, రాంబొట్ల విగ్రహాల ఆవిష్కరణ
ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈనెల 12న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి మండలం పచ్చవలో ఆ రోజు సాయంత్రం ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, ఆ గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు తానికొండ రాంబొట్లు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సభలో పాల్గొంటారు. ఆయనతోపాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.