మినీ గోకులాలను త్వరగా పూర్తి చేసుకోవాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:39 PM
మం డలంలో మినీ గోకులం పథకానికి సంబంధించి షెడ్‌లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన గోకులం షెడ్‌లను పూర్తి చేసుకోవాలని చీరాల డివిజన్ ఏపీడీ బత్తిన సింగయ్య సూచించారు. బుధవారం మండలంలోని గోపాలపురం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామంలో నిర్మాణంలో ఉన్న మినీ గోకులం షెడ్ పనులను పరిశీలించారు.
అద్దంకిటౌన్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మం డలంలో మినీ గోకులం పథకానికి సంబంధించి షెడ్‌లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన గోకులం షెడ్‌లను పూర్తి చేసుకోవాలని చీరాల డివిజన్ ఏపీడీ బత్తిన సింగయ్య సూచించారు. బుధవారం మండలంలోని గోపాలపురం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామంలో నిర్మాణంలో ఉన్న మినీ గోకులం షెడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతు చీరాల డివిజన్ పరిధిలో 385 గోకులం షెడ్‌లు మం జూరు అయ్యాయన్నారు. వాటిలో 42 పూర్తి కాగా మిగిలినవి వివిధ దశలల్లో ఉన్నాయన్నారు. అద్దంకి మం డలంలో మొత్తం 66 గోకులం షెడ్‌లు మంజూరు అయ్యాయని వాటిలో ఇప్పటికే 20 నిర్మాణంలో ఉన్నాయని మిగిలిన లబ్ధిదారులు త్వరగా షెడ్ పనులు ప్రారంభించుకోవాలన్నారు. ముందు కట్టుకున్న వారికి నగదు చెల్లింపులు చేయడం వెంటనే జరుగుతాయని, అందరూ త్వరగా నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. గ్రామాలలో ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలందరూ వారి జాబ్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసి తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని సంబంధిత ఎఫ్‌ఏ, మేట్‌లను సంప్రదించి ఉచితంగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకున్న కూలీలు మాత్రమే ఉపాధి హామీ పనులు చేయడానికి వీలవుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 25 శాతం ఈ కేవైసీ పూర్తి అయిందని, మరో రెండు రోజుల్లో 100శాతం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏపీవో నాగ కోటేశ్వరి, ఈసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.