Share News

ఖనిజ సంపద ప్రైవేటు పరం

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:19 AM

జిల్లాలో ఉన్న ఖనిజ సంపద సీనరేజీ వసూలు బాధ్యతను ఏఎంఆర్‌ కంపెనీ దక్కించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఆరు జిల్లాల సీనరేజీ వసూలును ప్రైవేటు వారికి కట్టబె ట్టారు. అదేక్రమంలో మన జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను (తెల్లరాయి, ఇసుక) మినహా ప్రస్తు తం భూగర్భంలో లభ్యమయే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్‌, మార్కాపురం పలకలు, కంకర, గ్రావెల్‌ సీనరేజీ ఏఎంఆర్‌ కంపెనీ వసూలు చేయనుంది.

ఖనిజ సంపద ప్రైవేటు పరం

ఏఎంఆర్‌ కంపెనీకి జిల్లాలో సీనరేజీ వసూలు బాధ్యత

నెలకు చెల్లించాల్సింది రూ.47.29 కోట్లు

25లోపు రంగంలోకి దిగనున్న కంపెనీ

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న ఖనిజ సంపద సీనరేజీ వసూలు బాధ్యతను ఏఎంఆర్‌ కంపెనీ దక్కించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఆరు జిల్లాల సీనరేజీ వసూలును ప్రైవేటు వారికి కట్టబె ట్టారు. అదేక్రమంలో మన జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను (తెల్లరాయి, ఇసుక) మినహా ప్రస్తు తం భూగర్భంలో లభ్యమయే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రానైట్‌, మార్కాపురం పలకలు, కంకర, గ్రావెల్‌ సీనరేజీ ఏఎంఆర్‌ కంపెనీ వసూలు చేయనుంది. నెలకు రూ.47.29 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,134 కోట్లు ప్రభుత్వానికి చెల్లించనుంది. ఈనెల 25లోపు ప్రభుత్వం నుంచి ఏఎంఆర్‌ కంపెనీ సీనరేజీ వసూలు బాధ్యతను తీసుకోనుంది. ఈమేరకు ఉత్తర్వులు వచ్చాయి. దీనివలన గ్రానైట్‌, కంకర అక్రమ రవాణాకు చెక్‌పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్‌ అడ్డగోలుగా తవ్వి జేబులు నింపుకొంటున్న అక్రమార్కుల ఆటలు కూడా సాగవని అంటున్నారు. మైనింగ్‌ శాఖలో విజిలెన్స్‌ విభాగం పనిచేస్తున్న ప్పటికీ గ్రానైట్‌ అక్రమాలను నిలువరించలేకపోతోంది. ఇక నుంచి ప్రైవేటు సైన్యం రంగంలోకి దిగనుంది.

అనేక ఇబ్బందులు ఖాయం

ప్రైవేటు కంపెనీ సీనరేజీ వసూళ్ల కోసం తమ సిబ్బందిని నియమించుకుంటుంది. ఈనేపథ్యంలో గ్రామాలలో తమ సొంత పొలాల్లో మట్టి తవ్వకాలు జరిపినా ఆ సిబ్బంది వచ్చి సీనరేజీ వసూలు చేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎక్కడైనా సొంత ఇంటి మెరకలకు చెరువు, వాగులలో గ్రావెల్‌ తవ్వకాలు చేస్తే కూడా ఇక నుంచి సీనరేజీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లు కనిపించినా ప్రైవేటు సైన్యం వీరవిహారం చూడాల్సి ఉంటుంది. దీని వలన అనేక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

Updated Date - Sep 13 , 2025 | 01:19 AM