Share News

పశుగ్రాసంగా మినుము పైరు

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:48 AM

అధిక వర్షాలు తెగుళ్ల పూత పిందె దశలోని మినుము పశుగ్రాసంగా మారింది.

పశుగ్రాసంగా మినుము పైరు

పంగులూరు, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): అధిక వర్షాలు తెగుళ్ల పూత పిందె దశలోని మినుము పశుగ్రాసంగా మారింది. మండలంలోని కొండమూరులో ఖరీఫ్‌ పంటగా ఇంచుమించు 1250 ఎకరాలలో రైతులు మినుముసాగు చేపట్టారు. ప్రస్తుతం పైరు వివిధ దశలలో ఉన్నాయి. ఈ ఏడాది జూలై మాసాంతంలో సాగుచేసిన మినుము పైరు ఆశాజనకంగా లేదని రైతులు వాపో తున్నారు. విత్తనం వేసిన అనంతరం పైరు మొలకదశకు చేరిననాటి నుంచి చాలినంత వర్షంపడక పైరు ఏపుగా ఎదగని పరిస్థితి నెలకొంది. అడపాదడపా పడిన వర్షపు జల్లు లతో ఆశించినమేర ఎదుగుదలకు నోచుకో లేదు. పైౖరుపూతదశకు చేరుకుని కొద్దోగొప్పో కాయఏర్పడే సమయానికి కురిసిన అధిక వర్షంతో పైరుకు ఏర్పడిన పూత, పిందే రాలి నేలపాలయింది. ఉన్నకొద్దిపాటి పూత, కాయ పక్వానికి చేరుకుని కాయ గింజపోసుకనే సమయం వరకు పెట్టేఖర్చుకు సరిపడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని భావించిన రైతులు ఉన్నపైరును గొర్రెల మేతగా వచ్చిన కాడకి అమ్ము కుంటున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 01:48 AM