క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:43 PM
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెంపొందు తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్లబ్ రోడ్డు నందు టెన్నిస్ కోర్టులో అండర్-14, 17 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్, సెలక్షన్స్‌ను మంగళవారం ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిన్నారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరులో జిల్లా స్థాయి
బ్యాడ్మింటన్ ఎంపికలు ప్రారంభం
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెంపొందు తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్లబ్ రోడ్డు నందు టెన్నిస్ కోర్టులో అండర్-14, 17 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్, సెలక్షన్స్‌ను మంగళవారం ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిన్నారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు నేటి స మాజంలోని యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు స్నేహ సంబంధాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. జిల్లా స్థాయిలో జరిగే టోర్నమెంట్‌లో ప్రతి ఒక్కరూ విజ యం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, సింగిల్‌విండో బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, ఎంఈవోలు నాగేశ్వర్‌రెడ్డి, అశ్వనీకుమార్, జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధేశ్వరశర్మ, టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వాహకులు జి.శోభన్‌బాబు, ఎస్.శ్రీనివాసరెడ్డి, సువర్ణలత, జగజ్జీవన్‌కుమార్, ధనలక్ష్మి, టెన్ని్‌సకోచ్ మురళి పాల్గొన్నారు.