మెగా కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
ABN , Publish Date - May 17 , 2025 | 11:00 PM
చూపులేకుండా అంధత్వంతో ఎవరూ బాధపడకూడదనే తాను నిరంత రం ఉచిత కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరా వతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన మెగా ఉచితనేత్ర వైద్య శిబిరానికి వందల మంది వృద్ధులు తరలివచ్చారు.
కనిగిరి, మే 17 (ఆంధ్రజ్యోతి): చూపులేకుండా అంధత్వంతో ఎవరూ బాధపడకూడదనే తాను నిరంత రం ఉచిత కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరా వతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన మెగా ఉచితనేత్ర వైద్య శిబిరానికి వందల మంది వృద్ధులు తరలివచ్చారు. కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వృద్ధుల ఆరోగ్య క్షేమ సమాచారాలను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర తెలుసుకున్నారు. గతంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రస్తుతం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకు న్నారు. ఇకనుంచి ప్రతినెలా మూడో శనివారం వైద్యశిబిరాలు నిర్వహిస్తామని తెలి పారు. గతంలో కంటి ఆపరేషన్లు చే యించుకున్న వారికి ఉచితంగా కళ్ళ అద్దాలు, మందులు పంపిణీ చేశారు. శనివారం నిర్వహించిన వైద్యశిబిరం లో 292 మంది కంటి పరీక్షలు చే యించుకున్నారు. వారిలో 262 మం దికి కంటి ఆపరేషన్లు అవసరమని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపా రు. మూడు విడతలలో వారిని కం టి ఆపరేషన్లకు గుంటూరుకు తరలి స్తామని తెలిపారు.