Share News

గురుకులాలకు రూ.64 లక్షలతో మెడికల్‌ కిట్లు

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:41 AM

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలకు రూ.64 లక్షల విలువైన మెడికల్‌ కిట్లను అందజేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనే యస్వామి తెలిపారు. శనివారం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాల యంలో కొండపి గురుకులంతోపాటు, జిల్లాలోని పలు గురుకులాలకు కిట్‌లను మంత్రి స్వామి అందజేశారు.

గురుకులాలకు రూ.64 లక్షలతో మెడికల్‌ కిట్లు
మెడికల్‌ కిట్లను, పరికరాలను అందజేస్తున్న మంత్రి స్వామి

మంత్రి డాక్టర్‌ స్వామి వెల్లడి

టంగుటూరు (కొండపి), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలకు రూ.64 లక్షల విలువైన మెడికల్‌ కిట్లను అందజేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనే యస్వామి తెలిపారు. శనివారం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాల యంలో కొండపి గురుకులంతోపాటు, జిల్లాలోని పలు గురుకులాలకు కిట్‌లను మంత్రి స్వామి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా గరుకులాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు రాబట్టేవిధంగా అవసరమైన శిక్షణ ఇస్తున్నదన్నారు. దసరా తర్వాత విద్యార్థులకు నీట్‌లో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ల బలోపేతానికి రూ.143 కోట్లతో మరమ్మతులు, రూ.100 కోట్లతో కొత్త భవనాలు నిర్మించామన్నారు. త్వరలోనే మరో రూ.200 కోట్లతో భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణ పనులు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో డీసీవో జయ, డబ్ల్యూహెచ్‌వో శ్రీనివాసాచారి, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 02:41 AM