Share News

రాజీ కోసం మధ్యవర్తిత్వం అవసరం

ABN , Publish Date - Jul 10 , 2025 | 11:35 PM

ప్రస్తుత సమాజంలో కోర్టు కేసులు త్వరగా పరిష్కరించుకోవడం కోసం మధ్యవర్తిత్వానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిందని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఏ ఓంకార్‌, కే భరత్‌చంద్ర అన్నారు.

రాజీ కోసం మధ్యవర్తిత్వం అవసరం
ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయాధికారులు ఓంకార్‌, భరత్‌చంద్ర, న్యాయవాదులు

గిద్దలూరు టౌన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సమాజంలో కోర్టు కేసులు త్వరగా పరిష్కరించుకోవడం కోసం మధ్యవర్తిత్వానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిందని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఏ ఓంకార్‌, కే భరత్‌చంద్ర అన్నారు. గురువారం దేశం కోసం మధ్యవర్తిత్వం అవగాహన వారోత్సవాలలో భాగంగా స్థానిక కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయగా న్యాయాధికారులు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గిద్దలూరు కోర్టుల వద్ద ముగ్గురు మధ్యవర్తులను ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ వారు నియమించినట్లు తెలిపారు. వీరు వారికి కేటాయించిన కేసుల్లో ఇరుపార్టీలకు సత్వర పరిష్కారానికి మధ్యవర్తులు చూపించాల్సిందిగా తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని మధ్యవర్తిత్వం ద్వారా తమ కోర్టు కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఈసందర్భంగా 1కే వాక్‌ను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీఎన్‌ శేషశైనారెడ్డి, ఉపాధ్యక్షుడు బి.ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఎ.తిరుమలప్రసాద్‌, అసిస్టెంట్‌ గవర్నమెంటు ప్లీడర్‌ డి.సంగీతరావు, న్యాయవాదులు పిడతల రాజశేఖర్‌రెడ్డి, కె.హిమశేఖర్‌రెడ్డి, కె.పోలయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:35 PM