తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:44 PM
మార్కాపురం పట్టణ పరిధిలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ సమీపంలో గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేయని డీప్‌బోర్‌కు మున్సిపాలిటీ అధికారులు మరమ్మతులు చేయించారు.
ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణ పరిధిలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ సమీపంలో గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేయని డీప్‌బోర్‌కు మున్సిపాలిటీ అధికారులు మరమ్మతులు చేయించారు. అంతేకాక మరికొంతమేర పైన్‌లైన్ వేయించి వార్డు ప్రజలకు సాధ్యమైన మేర ఎక్కువ మందికి నీటిని అం దించేందుకు చర్యలు చేయపట్టారు. పూ ర్తైన పనులను ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించి ప్రజలకు నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఉదయం ఎమ్మెల్యే స్వగృహంలో ముస్లిం మత పెద్దలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లు మాట్లాడుతూ కొన్ని మసీదులకు అధికారికంగా రిజిస్ట్రేషన్‌లు లేవని తెలిపారు. ఆ సమస్యను వెం టనే పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.