నేరాల నియంత్రణకు చర్యలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:31 PM
నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఏస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. సోమవారం రాత్రి పామూరు పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
పామూరు, సెస్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఏస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. సోమవారం రాత్రి పామూరు పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం సర్కిల్ కార్యాలయాన్ని కూడా పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరించాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోలీస్‌వాఖపై మరింత నమ్మకం కలిగించేలా ఉత్తమ సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ కె.రాఘవేంద్ర, కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్, ఎస్‌ఐ టి.కిశోర్‌బాబు, లు ఉన్నారు.