పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:48 AM
పర్యాటక రంగం అభివృధ్దికి అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
చీరాల, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి) : పర్యాటక రంగం అభివృధ్దికి అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రూ.2.35 కోట్లు నిధులతో జరుగుతున్న బీచ్ అభివృధ్ది పను లను శనివారం పరిశీలించారు. పర్యాటకులు ఇతర రాష్ర్టాల నుండి సైతం నిత్యం తీరానికి విచ్చేస్తున్న క్రమంలో వారికి వసతుల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నట్లు వివరించారు. ఈక్రమంలోనే రూ.40 లక్షలతో తాగునీటి పైప్‌లైన్స్, రూ.30 లక్షలతో డ్రెస్సింగ్ రూంలు, రూ.10 లక్షలతో ఓపెన్ షవర్ పాయింట్స్, రూ.30 లక్షలతో కమ్యూ నిటీ శానిటరీ కాంప్లెక్సు, రూ.95 లక్షలతో బయో టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులకు సంబంధించి స్థితిగతులను ఆరా తీశారు. అఽఽధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట పర్యాటక శాఖ అధికా రి నాగిరెడ్డి, నీటిసరఫరా అఽధికారి అనంత రాజు, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీ ల్దార్‌లు గోపీకృష్ణ, గీతారాణి, ఎంపీడివో విజయ, ఏఈ నాగరాజు సిబ్బంది ఉన్నారు.