Share News

శివుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా జీవించాలి

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:21 AM

నియోజకవర్గంలోని ప్రజలందరూ శివుని అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తాడివలస దేవరాజ్‌, బండారు జ్వాలా నరసింహం అన్నారు. గురువారం రాత్రి వాడరేవు సముద్రతీరంలోని ఆంజనేయుని విగ్రహం సమీపంలో సాగర హారతి నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు నగే్‌షకుమార్‌, వెంకటేష్‌, కార్తీక్‌ శర్మ, ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, ముఖ్య అతిథులుగా గుంటూరు ఆర్‌ఎ్‌సఎస్‌ విభాగ్‌ సంపర్క్‌ కృష్ణ మోహన్‌ హాజరయ్యారు.

శివుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా జీవించాలి
సాగర హారతి ఇస్తున్న వేద పండితులు

వాడరేవు(చీరాల), మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రజలందరూ శివుని అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తాడివలస దేవరాజ్‌, బండారు జ్వాలా నరసింహం అన్నారు. గురువారం రాత్రి వాడరేవు సముద్రతీరంలోని ఆంజనేయుని విగ్రహం సమీపంలో సాగర హారతి నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితులు నగే్‌షకుమార్‌, వెంకటేష్‌, కార్తీక్‌ శర్మ, ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, ముఖ్య అతిథులుగా గుంటూరు ఆర్‌ఎ్‌సఎస్‌ విభాగ్‌ సంపర్క్‌ కృష్ణ మోహన్‌ హాజరయ్యారు. ప్రతిపౌర్ణమికి సాగర హారతి ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పిక్కి నారాయణ, గురవయ్య, రామకృష్ణ, టీడీపీ గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:21 AM