నిర్మమహేశ్వరుని తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:50 AM
దక్షిణ కాశీగా పేరొందిన పొదిలి నిర్మమహేశ్వర స్వామి తెప్పోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పొదిలి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ కాశీగా పేరొందిన పొదిలి నిర్మమహేశ్వర స్వామి తెప్పోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వ్యర్థాలతో నిరుపయోగంగా ఉన్న పుష్కరిణిని(కోనేరు) ఇటీవల శుభ్రం చేయించి ఆధునీకరించారు. నిర్మమహేశ్వర స్వామి అమ్మవార్లతో తెప్పోత్సవాన్ని తొలి సారిగా నిర్వహించేందు సర్వం సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరిణిలో మోటార్ల ద్వారా నీటిని నింపారు. గత 50 ఏళ్లలో తెప్పోత్సవాన్ని నిర్వహించిన దాఖలు లేవని పట్టణ పెద్దలు పేర్క్టొఉన్నారు. ఈనేపధ్యంలో కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య ఆధ్వర్యంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా తెప్పో త్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 13న సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపైన ఆదిదంపతుల ఉత్సవ మూర్తులను ఉంచి తెప్పోత్సవాన్ని నిర్వహించ నున్నారు. ఉభయదాతలు గునుపూడి భాస్కర్ బ్రదర్స్, వీర్ల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పుష్కరిణి మాహాసంప్రోక్షణ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు జరిగే తెప్పోత్సవాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు ఒగ్గు వెంకటరామయ్య, దేవాదాయ ఈవో నర్రా నారాయణరెడ్డి కోరారు.
లక్ష్మినరసింహునికి హనువంత వాహనసేవ
గిద్దలూరు : మండలంలోని నరవ గ్రామం లో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు హనుమంత వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.