Share News

మార్కెట్‌కు అనుకూలమైన బేళ్లు తెచ్చుకోవాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:06 AM

పొ గాకు రైతులు ఏ రకం పొ గాకుకి డిమాండ్‌ ఉందో, రెం డు రోజులు ముందు పరి శీలించుకుని తమ కోటా రోజున ఆయా రకం బేళ్లను వేలానికి తెచ్చుకోవాలని పొ గాకు బోర్డు ఒంగోలు ఆర్‌ ఎం శీలం రామారావు రైతులకు సూచించారు.

మార్కెట్‌కు అనుకూలమైన బేళ్లు తెచ్చుకోవాలి

ఆర్‌ఎం రామారావు

టంగుటూరు (కొండపి), ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): పొ గాకు రైతులు ఏ రకం పొ గాకుకి డిమాండ్‌ ఉందో, రెం డు రోజులు ముందు పరి శీలించుకుని తమ కోటా రోజున ఆయా రకం బేళ్లను వేలానికి తెచ్చుకోవాలని పొ గాకు బోర్డు ఒంగోలు ఆర్‌ ఎం శీలం రామారావు రైతులకు సూచించారు. టంగుటూరు పొగాకు వేలం కేం ద్రంలో ఆయన వేలాన్ని గురువారం పరిశీలించారు. అనంతరం కమ్మవారిపా లెం, కట్టుబడివారిపాలెం గ్రామాల రైతులతో ఆయన మాట్లాడారు. వేలం కేం ద్రానికి బేళ్లను తెచ్చేటపుడు తేమ, వేడి లేకుండా పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. 2025-26 పంట కాలానికి పొగాకు బోర్డు అనుమతించిన మేరకు పొగాకు సాగు చేయాలని సూచించారు. పొలాలు, బ్యారన్లు అధిక రేట్లకు కౌ లుకు తీసుకోవద్దని ఆయన చెప్పారు. కమర్షియల్‌ నారుమడి సాగు చేసే రైతు లు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని, రైతులు కూడా రిజిస్టర్‌ అయిన నారుమడి నుంచి పొగాకు నారు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Aug 22 , 2025 | 12:06 AM