అట్టహాసంగా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:45 PM
పార్టీ కోసం కష్టపడే విధేయుల కు తప్పక పదవులు వరిస్తాయని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అన్నా రు.
పార్టీ కోసం కష్టపడే విఽధేయులకు
తప్పక పదవులు వరిస్తాయి
మంత్రులు స్వామి, రవికుమార్
మార్కాపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడే విధేయుల కు తప్పక పదవులు వరిస్తాయని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు అన్నా రు. స్థానిక మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ, నియోజకవర్గంలోని పలు పీఏసీఎ్‌సల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ముందుగా సెవెన్‌హిల్స్ లాడ్జీ దగ్గర నుంచి భారీ ఎత్తున మార్కెట్ యార్డు వరకు ర్యాలీ జరిగింది. మం త్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులకు అక్కడ గజమాలతో ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో కాలేజీ రో డ్డులో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ర్యాలీ అనంతరం మార్కెట్ యార్డులో ఏఎమ్‌సీ ఛైర్మన్‌గా మాలపాటి వెంకటరెడ్డి, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారం తా కష్టపడి భవిష్యత్‌లో పార్టీ పటిష్టానికి పాటుపడాలని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు మెరుగైన సేవలందించాలని ఎంపీ మాగుంట అన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నాయకులందరూ కష్టపడి పనిచేసి విజయఢంకా మోగిద్దామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటక సుబ్బారెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు కృష్ణారావు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.