Share News

ప్రజా ప్రభుత్వంతోనే మార్కాపురం అభివృద్ధి

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:21 PM

మార్కాపురం ప్రాంత అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 3వ వార్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ప్రజా ప్రభుత్వంతోనే మార్కాపురం అభివృద్ధి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం ప్రాంత అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 3వ వార్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ జిల్లా ప్రకటనతో మార్కాపురం స్వరూపం మారిపోనుందని అన్నారు. ఇక్కడికి పలు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. ఇప్పటికే పలు వైద్యశాలలు, విద్యాసంస్థలు మార్కాపురం వచ్చేందుకు భూములు కూడా కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఇస్టంలేని ప్రతిపక్ష వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం జిల్లా సుభిక్షంగా మారుతుందన్నారు. అభివృద్ధిని చేసేవాళ్లు ఎవరో, అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. దుష్ప్రచారం చేసేవారికి భవిష్యత్తులోనూ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్‌, పట్టణ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, మేడిద రంగస్వామి, సయ్యద్‌ గఫార్‌, టీడీపీ పట్టణ యూత్‌ అధ్యక్షులు దొడ్డా దర్గే్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 10:21 PM