గంజాయి ముఠా అరెస్టు
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:56 PM
గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఒంగోలు పరిసరప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు.
5 కిలోల సరుకు స్వాధీనం
ఒంగోలు క్రైం, జూన్18(ఆంధ్రజ్యోతి): గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఒంగోలు పరిసరప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నా మని చెప్పారు. ఈక్రమలో బుధవారం సాయంత్రం స్థానిక సీతారామపురం కొండమీద గల రామాలయం వద్ద చినగజాంకు చెందిన కుక్కల గోవర్ధన్‌రెడ్డి, ఒడిశాకు చెందిన రాజేష్‌నాయక్, మహేశ్వర ముడి, ఒంగోలు బడ్లమిట్టకు చెందిన షేక్ ముజీర్‌ని అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.