Share News

వైసీపీని వీడి పలువురు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:17 PM

పీసీపల్లి మండలంలోని తలకొండపాడు, పాలేటిపల్లి గ్రామాలకు చెందిన 11కుటుంబాలు వైసీపీని వీడి శనివారం టీడీపీలో చేరారు. కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో జరి గిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.

వైసీపీని వీడి పలువురు టీడీపీలో చేరిక
ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

పీసీపల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పీసీపల్లి మండలంలోని తలకొండపాడు, పాలేటిపల్లి గ్రామాలకు చెందిన 11కుటుంబాలు వైసీపీని వీడి శనివారం టీడీపీలో చేరారు. కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో జరి గిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృ ద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయ న్నారు. అదే విశ్వాసంతో తలకొండపాడు పంచాయతీ లోని పాలేటిపల్లి, తలకొండపాడు గ్రామప్రజలు టీడీ పీలో చేరడం అభినందనీయమన్నారు. టీడీపీలో చేరి నవారిలో ఏసురత్నం, దేవదాసు, ఇషాక్‌, మేరి, వెం కటేశ్వర్లు, పద్మ, శ్రీనివాసులు, వెంకటనారాయణ, కోట య్య, వెంకటేశ్వర్లు, సురేష్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు నెలకుర్తి మాల్యాద్రి, సర్పంచ్‌ ముప్పూరి మాల్యాద్రి, పోలినేని మాలకొండయ్య, కూరపాటి లక్ష్మణ్‌, కూరపాటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రను కలిసిన మైనార్టీ నాయకులు

పామూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పామూ రులోని ఎర్రచేలు పరిధిలో నూతనంగా నిర్మించే బొవు మజీద్‌ అండ్‌ మదర్సా నిర్మాణ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని పామూరు ముస్లింలు శనివారం కలిసి ఆహ్వనించారు. కనిగిరిలోని అమరావతి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఈనెల 24న శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం టీడీపీ ముస్లిం మైనార్టీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన షేక్‌ జం షీర్‌ను శాలువాతో సన్మానించారు.

ఉగ్రను కలిసిన వారిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు స య్యద్‌ అమీర్‌బాబు, మండల ప్రధాన కార్యదర్శి షేక్‌ హజీగౌస్‌, మదర్సా నిర్వాహకుడు మౌలాన షరీఫ్‌, కోడి గుంపల నాయబ్‌రసూల్‌, ఖాదర్‌, రసూల్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 10:17 PM