పలువురు టీడీపీలో చేరిక
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:29 PM
మార్కాపురం పట్టణంలోని గొర్లగడ్డ వీధికి చెందిన ప్రముఖులు పఠాన్ సర్దార్ ఖాన్, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం పట్టణంలోని గొర్లగడ్డ వీధికి చెందిన ప్రముఖులు పఠాన్ సర్దార్ ఖాన్, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారలో పఠాన్ మస్రాత్‌ఖాన్, పర్రాన్ ఖాన్, రియాన్, ఆఫాన్ తదితరులు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీం ఖాన్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మొగల్ ఫిదా హుస్సేన్‌బేగ్, టీడీపీ మైనార్టీ పట్టణాధ్యకుడు ఉస్తాద్, మొగల్ జాబిర్ హుస్సేన్ బేగ్ పాల్గొన్నారు.