Share News

పాము కాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:58 PM

పాము కాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది.

పాము కాటుకు గురై చికిత్స   పొందుతూ వ్యక్తి మృతి

కనిగిరి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : పాము కాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామానికి చెందిన బాగని సురేష్‌(25) అనే యువకుడు అయ్యప్ప మాల ధరించాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలసి బుధవారం పొదిలి నుంచి భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి గుడిని సందర్శించుకున్నారు. అదే రోజు రాత్రి కనిగిరి మండల పరిధిలోని నందనమారెళ్లలోని శివాలయం గుడిలో నిద్రిస్తుండగా, సురేష్‌ పాముకాటుకు గురయ్యాడు. వెంటనే ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:58 PM