Share News

చీమకుర్తి మున్సిపాలిటీకి మహర్దశ

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:02 AM

చీమకుర్తి మున్సిపాలిటీకి మహర్ధశ పట్టబోతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా దాదాపు రూ.4.50కోట్లతో అభివృద్థి పనులకు మున్పిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

చీమకుర్తి మున్సిపాలిటీకి మహర్దశ

రూ.4.50కోట్లతో అభివృద్ధి పనులు

కౌన్సిల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం

ఎమ్మెల్యే బీఎన్‌ చొరవతో కల సాకారం

చీమకుర్తి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి మున్సిపాలిటీకి మహర్ధశ పట్టబోతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా దాదాపు రూ.4.50కోట్లతో అభివృద్థి పనులకు మున్పిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన డీఎంఎఫ్‌ నిధులు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో పాటు 15వ పైనాన్స్‌ నిధులుతో పట్టణంలో పలు అభివృద్థి పనులను చేపట్టటానికి మార్గం సుగమం కానుంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.రాజ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. అజెండాలో పొందుపరిచిన 39 అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రూ.2.60కోట్ల డీఎంఎఫ్‌ నిధులు, రూ.54లక్షలు ఒడా నిధులు, రూ.95లక్షలు ఎస్‌ఎ్‌ఫసీ నిధులు, రూ.35లక్షల ఎస్సీసబ్‌ప్లాన్‌ నిధులతో చీమకుర్తి పట్టణాన్ని సుందరాంగంగా తీర్చిదిద్దనున్నారు. టెండర్లు కూడా పూర్తయిన ఈ నిధులతో రెండునెలల లోపే సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, కమ్యూనిటీ భవనాలు, ఎస్సీలకు చెందిన శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులు నిర్వహించనున్నారు. కమిషనర్‌ రామకృష్ణయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:02 AM