లోపాలు లేకుండా మహాకుంభాభిషేకం
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:58 PM
మహా కుంభాభిషేకం ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం రాతి ముఖ మండప నిర్మాణ పనులు పూర్తయిన తరువాత మే 19 న నిర్వహించే మహాకుంభాభిషేకం ఏర్పాట్లపై గురువారం ఉదయం తాడేపల్లిలోని మంత్రి నివాసంలో దేవస్థానం అధికారులు, పూజారులతో మంత్రి రవికుమార్ చర్చించారు.
ఏర్పాట్లపై మంత్రి గొట్టిపాటి
ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని
దేవస్థానం అధికారులకు సూచన
అద్దంకి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : మహా కుంభాభిషేకం ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం రాతి ముఖ మండప నిర్మాణ పనులు పూర్తయిన తరువాత మే 19 న నిర్వహించే మహాకుంభాభిషేకం ఏర్పాట్లపై గురువారం ఉదయం తాడేపల్లిలోని మంత్రి నివాసంలో దేవస్థానం అధికారులు, పూజారులతో మంత్రి రవికుమార్ చర్చించారు. మహాకుంభాభిషేకానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రశాంతంగా స్వామి వారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహాకుంభాభిషేకం నిర్వహణకు శృంగేరి పీఠాధిపతి, శిష్య బృందం వస్తున్నందున ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం తదితర కార్య క్రమాల నిర్వహణకు టీటీడీ కల్యాణ మండపాన్ని రీమోడల్ చేయిస్తున్నట్లు మంత్రికి ఈవో తిమ్మానాయుడు వివరించారు. అదే సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బసకు ఇబ్బంది లేకుండా అన్ని సామాజిక అన్నదాన సత్రాలలో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి చెప్పినట్లు మంత్రి రవికుమార్‌కు ఈవో తెలిపారు. సమావేశంలో ప్రధాన పూజారి లక్ష్మీనారాయణ, ఆచార్యులు, కిషోర్ పాల్గొన్నారు.