Share News

వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:50 PM

కంభం మండలం మదారుపల్లి గ్రామం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు
మదారుపల్లిలో ఈశ్వరీదేవి పల్లకీని మోస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కంభం మండలం మదారుపల్లి గ్రామం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి పల్లకీని మోశారు. కార్యక్రమంలో తురిమెళ్ల సర్పంచ్‌ మాదా సుభద్ర, మాజీ సర్పంచ్‌ నారిశెట్టి వీరమ్మ, గిద్దలూరు మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బైలడుగు బాలయ్య పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

రాచర్ల : రాచర్ల గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదివారం ప్రత్యే క పూజలు చేశారు. ఆదివారం అయ్యప్ప దీక్షధారుల ఇరుముడి కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అశోక్‌రెడ్డిని ఆహ్వానించారు. ముందుగా అశోక్‌రెడ్డి అయ్యప్పకు ప్రత్యేక పూజలు జరిపిం చి అనంతరం ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని కోరారు. ఇరుముడి సందర్భంగా అనుములవీడు గ్రామ టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 10:50 PM