నాలుగు బార్లకు లాటరీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:35 AM
జిల్లాలో మిగిలిపోయిన బార్లకు రెండోసారి లాటరీ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. ఐదింటికి దరఖాస్తులు ఆహ్వానించగా నాలుగు మాత్రమే నిబంధనల ప్రకారం లాటరీకి ఎంపికయ్యాయి.
మార్కాపురంలో మిగిలిపోయిన ఒక బార్
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మిగిలిపోయిన బార్లకు రెండోసారి లాటరీ ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. ఐదింటికి దరఖాస్తులు ఆహ్వానించగా నాలుగు మాత్రమే నిబంధనల ప్రకారం లాటరీకి ఎంపికయ్యాయి. మంగళవారం ప్రకాశం భవన్‌లో డీఆర్వో చిన ఓబులేశు సమక్షంలో నాలుగు బార్లకు లాటరీ తీసి యజమానిని ఎంపిక చేశారు. వాటిలో ఒంగోలులో మూడు, మార్కాపురంలో ఒక బార్ ఉన్నాయి. మార్కాపురంలో ఇంకో బార్‌కు నాలుగు దరఖాస్తులు రానందున లాటరీ నిలిపివేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్.ఆయేషాబేగం, ఏఈఎస్ యర్ర వెంకట్, చీమకుర్తి సీఐ సుకన్య పాల్గొన్నారు.