Share News

లోగ్రేడ్‌ పొగాకును కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:34 AM

లో గ్రేడ్‌ పొగాకును క్వింటాను రూ.20వే లకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

లోగ్రేడ్‌ పొగాకును కొనుగోలు చేయాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రావు

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యో తి): లో గ్రేడ్‌ పొగాకును క్వింటాను రూ.20వే లకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో శనివారం జయంతి బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ వర్జీని యా పొగాకు ధరలు రోజురోజుకు పడిపోతు న్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చే సుకొని పొగాకు రైతులను ఆదుకోవాలని డి మాండ్‌ చేశారు. కంపెనీలు లోగ్రేడ్‌ను కొనుగో లు చేయకుండా మేలు రకం పొగాకును మా త్రమే కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం జోక్యం చేసు కుని రైతులను ఆదుకోవాలని కోరారు. సమా వేశంలో నాయకులు ఎస్‌కే.బాబు, పెంట్యాల హనుమంతరావు, ఊసా వెంకటేశ్వర్లు, పిల్లి తి ప్పారెడ్డి, బెజవాడ శ్రీనివాసరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, కనపర్తి సుబ్బారావు, డి.తిరుపతి రెడ్డి, ముప్పరాజు బ్రహ్మయ్య, నెల్లూరు నర సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:34 AM