దివ్యాంగులకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:43 AM
దివ్యాంగు లకు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ప్రకాశం భవన్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 57మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్నారు.
57 మంది కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత
ఒంగోలు క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగు లకు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ప్రకాశం భవన్‌లో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 57మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్నారు. శనివారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో వారికి ఎల్‌ఎల్‌ఆర్ (లైట్ లెర్నర్) కంప్యూటర్ పరీక్ష నిర్వహిం చారు. రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ఆర్.సుశీల, దివ్యాంగుల శాఖ ఏడీ సువార్త పర్యవేక్షించారు. పరీక్షకు హాజరైన 57మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు ధర్మేంద్ర, జయప్రకాష్ పాల్గొన్నారు.