Share News

లింగన్నపాలెం జనసంద్రం

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:13 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా గుంటూరు లింగన్నపాలెం గ్రామం జనసంద్రంగా మారింది. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెేలాదిమంది ప్రజలు, మహిళలు, యువత భారీసంఖ్యలో తరలివచ్చారు.

లింగన్నపాలెం జనసంద్రం
కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశంకు టీడీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం చంద్రబాబు, పక్కన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

సీఎం పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలు

పీసీపల్లి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా గుంటూరు లింగన్నపాలెం గ్రామం జనసంద్రంగా మారింది. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెేలాదిమంది ప్రజలు, మహిళలు, యువత భారీసంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబును చూసేందుకు ప్రజలు ఉదయం నుంచే లింగన్నపాలెం గ్రామ సమీపంలోని ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో ఏర్పాటుచేసిన సభాస్థలికి పెద్దఎత్తున చేరుకున్నారు. సభావేదికకు సీఎం చంద్రబాబు చేరుకోవడంతో సభాప్రాంగణం చప్పట్లు, హర్షధ్వనులతో మారుమోగింది. ప్రజల ఉత్సాహానికి మగ్ధుడైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ త్వరలో కనిగిరి కనకపట్నంగా మారబోతుందన్నారు. పరిశ్రమల రాకతో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అనడంతో ప్రజలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.

సీఎం పర్యటనకు తరలివచ్చినవారిలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య, మండలపార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య, ఓబుల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రామారావు, హనుమారెడ్డి, పువ్వాడి నాగరాజు, నరేంద్ర, నాగార్జున, పువ్వాడి సుభాష్‌చందబ్రోస్‌, మాల్యాద్రి, శివరామయ్య, ఏనుగంటి శ్రీను, నాగేంద్రబాబు, కొండపనాయుడు, పల్లా మల్లికార్జున్‌, మాజీ మండలపార్టీ అధ్యక్షుడు కరణం తిరుపతయ్య, వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య, గడ్డం సుబ్బరాయుడు, ముప్పూరి తిరుపతమ్మ, కోటపాటి గోపి, ములకా నాగేశ్వరరావు, మల్లికార్జున, కంచర్ల వెంగయ్య, దుంప సంపూర్ణ, తదితరులు ఉన్నారు.

సీఎం సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీపీ ప్రకాశం

కనిగిరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం తెలుగుదేశం పార్టీలో చేరారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభానికి మంగళవారం వచ్చిన చంద్ర బాబునాయుడు సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనర సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు. ఈసందర్భంగా సీఎం అభినందనలు తెలుపుతూ టీడీపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ ప్రకాశంకు సీఎం సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండా కృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నాయకులు బాలు ఓబులురెడ్డి, హెచ్‌ఎంపాడు మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), గాయం తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పామూరు నుంచి తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు

పామూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు పామూరు, సీఎస్‌పురం మండలాల టీడీపీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. తరలివెళ్లినవారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దనరావు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, యారవ రమాదేవి, యారవ శ్రీను, బొల్లా నరసింహారావు, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొబ్బూరి రాజేష్‌, బి.వెంగయ్య, ఎస్‌సీ మాలకొండయ్య, తదితరులు ఉన్నారు.

చంద్రబాబును కలిసిన నాయుడుబాబు

పామూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గుంటూరు లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎఈ పార్క్‌ ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పామూరుకు చెందిన టీఎన్‌ఎస్వీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి పోకా నాయుడుబాబు హెలిప్యాడ్‌ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకారు. సీఎంకు పుష్పం అందజేశారు. ఈసందర్భంగా చంద్రబాబు ఏం నాయడుబాబు బాగున్నావా అంటూ ఆత్మీయంగా పలకరించారు.

Updated Date - Nov 11 , 2025 | 10:13 PM