Share News

టీచర్ల జీతాలకు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:24 AM

ఉమ్మడి జిల్లాలో జూన్‌లో బదిలీ అయిన, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయల జీతాల చెల్లింపులకు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ, టీచర్ల పునఃకేటాయింపుతో వారికి జీతాల చెల్లింపులో జాప్యం జరిగింది. జిల్లాలో 5,248 మంది టీచర్లు బదిలీ కాగా ఉద్యోగోన్నతుల ద్వారా 394 మందికి స్థానచలనం కలిగింది. పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆరు రకాల స్కూళ్లు తొమ్మిది రకాలుగా మారాయి.

టీచర్ల జీతాలకు లైన్‌క్లియర్‌

బదిలీ అయిన వారికి పొజిషన్‌ ఐడీలు సిద్ధం

పాఠశాల విద్యాశాఖలో కొత్త కేడర్‌ స్ట్రెంగ్త్‌

బకాయి బిల్లుల సమర్పణకు అవకాశం

ఒంగోలు విద్య, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో జూన్‌లో బదిలీ అయిన, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయల జీతాల చెల్లింపులకు ఎట్టకేలకు లైన్‌క్లియర్‌ అయింది. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ, టీచర్ల పునఃకేటాయింపుతో వారికి జీతాల చెల్లింపులో జాప్యం జరిగింది. జిల్లాలో 5,248 మంది టీచర్లు బదిలీ కాగా ఉద్యోగోన్నతుల ద్వారా 394 మందికి స్థానచలనం కలిగింది. పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆరు రకాల స్కూళ్లు తొమ్మిది రకాలుగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 1, 2 తరగతులను అదనంగా కలిపి హైస్కూళ్లను 1 నుంచి పది తరగతులకు పెంచింది. దీంతో పాఠశాల కేడర్‌ స్ర్టెంగ్త్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా టీచర్లకు రెండు నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం జరిగింది. ఈ క్రమంలో కొత్త కేడర్‌ స్ట్రెంగ్త్‌ను నిర్వహించింది. సిబ్బంది, టీచర్లు, హెచ్‌ఎంలకు కొత్త పొజిషన్‌ ఐడీలు క్రియేట్‌ కావడంతో జీతాల చెల్లింపునకు సంబంధించిన సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం డీడీవోల లాగిన్‌లోని పాత క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను ఉపసంహరించారు. కొత్త క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను కేటాయించాలని ఉన్నతాధికారులు సూచించారు. డీడీవో సంబంధిత సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి అక్కడ వేలిముద్రలు వేసి మళ్లీ సీఎఫ్‌ఎంఎస్‌ సైట్‌లో లాగిన్‌ కావాల్సి ఉంది. వీరు ఆసైట్‌లోకి లాగిన్‌ అయిన వెంటనే సిబ్బంది, టీచర్ల వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. వాటిని పరిశీలించి తమ పాఠశాలల వాస్తవంగా ఉన్న సిబ్బంది, సైట్‌లో చూపిస్తున్న సిబ్బందిని సరిపోల్చుకొని ధ్రువీకరించుకోవాల్సి ఉంది. అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే వెంటనే గత రెండు నెలల అరియర్‌ జీతాలు బిల్లులను సిద్ధం చేసి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఈనెల రెగ్యులర్‌ బిల్లు డ్రా చేసేందుకు వీలవుతుంది. శనివారం వెబ్‌సైట్‌లో ఆ బిల్లుల స్వీకరణ ఎనబుల్‌ అవుతుంది.

3,049 పాఠశాలలకు కొత్త కేడర్‌ స్ట్రెంగ్త్‌

ఉమ్మడి జిల్లాలో పునర్‌వ్యవస్థీకరించిన 3,049 పాఠశాలలకు కొత్త క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను ప్రకటించారు. 117 జీవో రద్దు అనంతరం జిల్లాలో 6 రకాల స్కూళ్లను 9 రకాలుగా చేశారు. శాటిలైట్‌ స్కూళ్లు-3, ఫౌండేషన్‌ స్కూళ్లు 351, బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు, 1,433, మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు 713, అప్పర్‌ పైమరీ స్కూళ్లు 86, హైస్కూళ్లు (6నుంచి10) 310, హైస్కూల్‌ ప్లస్‌ బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు (1నుంచి 10) 61, హైస్కూల్‌ ప్లస్‌ మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు (1నుంచి 4) 92, హైస్కూలు ప్లస్‌లు ఏర్పాటు చేశారు. బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లు, మోడల్‌, యూపీ స్కూళ్లకు సంబంధిత ఎంఈవోలు జీతాలు చెల్లిస్తారు. హైస్కూళ్లకు 1నుంచి 10 తరగతులున్న చోట 1నుంచి5తరగతులకు బోధించే ఎన్‌జీటీలకు కూడా హైస్కూలు హెచ్‌ఎంలు జీతాలు చెల్లిస్తారు.

Updated Date - Aug 09 , 2025 | 01:24 AM