Share News

సాగుకు జీవం

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:42 AM

జిల్లావ్యా ప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు జీవం పోశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి వర్షాలు సజావుగా లేక పంటలు పెద్దగా వేయ లేదు. మొత్తం వ్యవసాయ శాఖ పరిధిలో లక్షా 29వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉండ గా ఇప్పటివరకు 65శాతం మాత్రమే సాగయ్యాయి.

సాగుకు జీవం
వర్షాలకు దర్శిప్రాంతంలో కళకళలాడుతున్న పత్తి పైరు

నాలుగు రోజులుగా పలుచోట్ల వర్షాలు

ఒంగోలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యా ప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు జీవం పోశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచి వర్షాలు సజావుగా లేక పంటలు పెద్దగా వేయ లేదు. మొత్తం వ్యవసాయ శాఖ పరిధిలో లక్షా 29వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉండ గా ఇప్పటివరకు 65శాతం మాత్రమే సాగయ్యాయి. అలా 84వేల హెక్టా ర్లలో మాత్రమే పంట లు సాగు కాగా తొలకరిలో వేసిన నువ్వు కోతలు జరి గాయి. సజ్జ కూడా కోస్తున్నారు. ఇక 75 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు పొలంలో ఉన్నాయి. ప్రధానంగా 44 వేల హెక్టార్లలో సాగైన కంది, 7,560 హెక్టార్లలో వరి, 14,500 హెక్టార్లలో పత్తి, 5,706 హెక్టార్లలో మొక్కజొన్న అలాగే మరో పదివేల హెక్టార్లలో మిర్చి ప్రస్తుతం పొలం లో ఉండగా ఈనెల తొలిపక్షంలో సరైన వర్షం లేక ఆ పంటలు కూడా పలుచోట్ల వాడుముఖం పట్టాయి. కొన్నిచోట్ల ఎదుగుదల లోపించింది. ఇంకా చాలా విస్తీర్ణంలో పంటలు సాగు చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు ఊతమిచ్చాయి. ఈనెలలో ఇప్పటివరకు 76.20 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా అందులో ఈ నాలుగు రోజుల్లోనే 53 మి.మీ పడింది. అందులో కొన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అలా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పొలంలో ఉన్న పైర్లకు జీవం పోయడమే కాక విస్తారంగా వరి సాగుకు, అలాగే పశ్చిమ ప్రాతంలో పొగాకు నాట్లు వేసేందుకు కూడా ఉపకరించనున్నాయి. మరోవైపు రబీ సీజన్‌లో పంటల సాగుకు వీలుగా రైతులు భూములను సిద్ధం చేసుకునేందుకు ఈ వర్షాలు కలిసొచ్చాయి. ఇదిలా ఉండగా శనివారం పగటి పూట కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Updated Date - Sep 21 , 2025 | 02:42 AM